టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా హిట్ టాక్ ని సొంత చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. ఇక ఈ అందాల భామకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమెకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈమె నటనతో లేడి పవర్ స్టార్ అని పేరు కూడా సొంత చేసుకుంది.  ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా శ్రీకాకుళం యాసలో తెరకెక్కింది.
సినిమా హిట్ అవ్వడానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సాయి పల్లవి ఒక ఎత్తు. ఆమె ఒక సినిమాలో నటిస్తుందంటే చాలు ఆ సినిమా పక్క హిట్ కోడతుందని ముందే ఫిక్స్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆమె సినిమాలను సెలెక్ట్ చేసుకునే విధానమే వేరు. అలాగే ఆ సినిమాలో సాయి పల్లవి నటన మామూలుగా ఉండదు.
అయితే ఇటీవల సాయి పల్లవి అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానలు ఇచ్చింది. అందులో భాగంగా ఆమెను అబ్బాయిలు ఎలాంటి డ్రెస్ లు వేసుకుంటే నచ్చుతరని అడిగారు. దానికి సాయి పల్లవి మాట్లాడుతూ.. 'నాకు తెలియదు. కానీ నాకు అబ్బాయిలు నలిగిపోయిన బట్టలు వేసుకుంటే నచ్చదు. ఒకవేళ నా కుటుంబంలో కూడా అలాంటి వారు ఎవరైనా కనిపిస్తే.. వాటిని వెంటేనే సరిచేయడానికి ప్రయత్నిస్తా' అని సమాధానం ఇచ్చింది. దానికి నాగ చైతన్య ' అబ్బాయిలు విన్నారుగా. ఈ సారి సాయి పల్లవిని కలవడానికి వస్తే.. వచ్చే ముందు మీ డ్రెస్ ని బాగా ఉతికి, ఇస్త్రీ చేసి వేసుకొని రండి అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: