నాగచైతన్య చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన తండేల్ మూవీ నేడు థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. తండేల్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. తండేల్ సినిమా 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి.
 
నాగచైతన్య, సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోగా తండేల్ మూవీ ఆ సినిమాను మించిన హిట్ గా నిలిచిందని తెలుస్తోంది. తండేల్ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం నెస్ట్ లెవెల్ లో చైతన్య కెరీర్ బెస్ట్ అనేలా ఉండటం గమనార్హం. తండేల్ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
 
తండేల్ సినిమా తక్కువ నిడివితో తెరకెక్కగా నిడివి కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. చందూ మొండేటి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా ఇతర భాషల ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. తండేల్ సినిమాలో నాగచైతన్య ఇంట్రడక్షన్ సీన్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.
 
గత సినిమాలతో పోల్చి చూస్తే నాగచైతన్య ఈ సినిమాలో మెరుగ్గా నటించాడని చెప్పవచ్చు. 2025 సంవత్సరం అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తండేల్ సినిమ నాగచైతన్య కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలిచే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తండేల్ సినిమాకు చైతన్య సాయిపల్లవి జోడీ హైలెట్ గా నిలిచిందని తెలుస్తోంది. తండేల్ సినిమా ఫిబ్రవరి నెల బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉంది. యునానిమస్ హిట్ టాక్ వచ్చి ఉంటే ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యేది.




మరింత సమాచారం తెలుసుకోండి: