టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. నేడు గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటిరోజు పూర్తి అవ్వకముందే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎంతగానో ప్రేమించుకున్న ఒక జంట ఎడబాటుకు గురి అయితే పడే బాధను, ప్రేమను ప్రతిబింబిస్తుంది. సినిమా బాగుంది.. ఒకసారి చూసి ఎంజాయ్ చెయ్యచ్చు అంటూ ఆడియన్స్ కామెంట్స్ లో పెడుతున్నారు. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి చాలా బాగా నటించారు. వారిద్దరి పాత్రలు, నటన చాలా సహజంగా ఉంది అంట. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల నటనతో పాటు DSP అందించిన అద్బుతమైన సంగీతం కూడా ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్ గా మారింది. 
ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా శ్రీకాకుళం యాసలో తెరకెక్కనుంది.
సినిమా హిట్ అవ్వడానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సాయి పల్లవి ఒక ఎత్తు. ఆమె ఒక సినిమాలో నటిస్తుందంటే చాలు ఆ సినిమా పక్క హిట్ కోడతుందని ముందే ఫిక్స్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆమె సినిమాలను సెలెక్ట్ చేసుకునే విధానమే వేరు. అలాగే ఆ సినిమాలో సాయి పల్లవి నటన మామూలుగా ఉండదు. ఇక ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన బుజ్జితల్లి పాటతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.  ఈ సినిమా ప్రమోషన్స్‌ తోనే దూసుకుపోతుంది. ఈ సినిమా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించారు. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి మరి.   





మరింత సమాచారం తెలుసుకోండి: