హీరో సిద్ధార్థ్ అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఈయన హీరో గానే కాదు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీలలో ఇరుక్కున్న సిద్ధార్థ్ తాజాగా  షాకింగ్ కామెంట్లు చేశారు. నేను అలాంటి వ్యాధితో బాధపడుతున్నానని,నా వ్యాధికి కారణం కూడా నా ఫ్యాన్స్ అంటూ మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చారు.మరి ఇంతకీ సిద్ధార్థ్ కి ఉన్న ఆ వ్యాధి ఏంటి ఎందుకు అభిమానుల వల్లే తనకు ఈ వ్యాధి వచ్చిందని అంటున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. సిద్ధార్థ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని, ఆ వ్యాధి కూడా అభిమానుల వల్లే వచ్చింది అంటూ చెప్పారు. ఇక సిద్ధార్థ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలామంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్ట్డం కోసం పాకులాడుతూ ఉంటారు. నేను కూడా అలాగే చేశాను. కానీ స్టార్డం వచ్చాక నా అభిమానుల వల్లే నేను ఓ వ్యాధి బారిన పడ్డాను.

 ఎంతోమంది స్టార్డం వస్తే దాన్ని ఎంజాయ్ చేస్తారు.కానీ నేను మాత్రం ఎంజాయ్ చేసే సమయంలో ఇబ్బందులు పడ్డాను. నాకు స్టార్డం వచ్చాక అభిమానుల ఫాలోయింగ్ వల్ల నాకు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అనే వ్యాధి వచ్చింది.. నేను స్టార్డం తెచ్చుకున్నాక ఎంతో మంది అభిమానులు నన్ను ఫాలో చేస్తూ నాతో మాట్లాడడానికి తెగ ఆసక్తి చూపించారు.కానీ అభిమానులతో మాట్లాడితే నాకు చాలా టెన్షన్ వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని వైద్యులను సంప్రదించగా నాకున్న ఆశ్చర్యకరమైన వ్యాధి గురించి వాళ్లు బయట పెట్టారు.అయితే ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ నుండి బయటపడడానికి నేను చాలా రోజులు ఇబ్బంది పడ్డాను.అంతే కాదు ఈ వ్యాధి నుండి కోలుకోవడానికి నాకు ఏకంగా 7,8 సంవత్సరాల సమయం పట్టింది. నాకు  స్టార్డం ఎంజాయ్ చేశాలోపే ఇలా జరిగింది.

కానీ నాకు ఇంత మంచి స్టార్డం అందించినందుకు అభిమానులకు ఎప్పటికీ కృతజ్ఞుడిగానే ఉంటాను. అయితే నాకు ఈ స్టార్డం వచ్చిన సమయంలో నేను అభిమానులకి కృతజ్ఞుడిగానే ఉన్నాను. కానీ నా అటెన్షన్ వాళ్లకు వేరే విధంగా అర్థమైంది. ఇక ఆడియన్స్ అటెన్షన్ నాకు అర్థం అవ్వడానికి చాలా సమయమే పట్టింది.. అంటూ సిద్ధార్థ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ మాటలు విన్న అదితి సిద్ధార్థ్ కి స్పాట్ లైట్ లో అటెన్షన్ గా ఉండడం అంటే చాలా అసహ్యం.కానీ నేను మాత్రం అటెన్షన్ నే ఇష్టపడతాను. ఎందుకంటే ఎదుటివారు మనల్ని ఇష్టపడడం,ప్రేమించడం నేను అదృష్టమని భావిస్తాను.కానీ సిద్దు అలా ఉండడు అంటూ చిన్నపాటి గొడవ పెట్టుకున్నట్టు మాట్లాడింది. ఇక సిద్ధార్థ్ అదితిల మాటలు విన్న నెటిజెన్స్ అదితి మాట్లాడిందే కరెక్ట్ అని ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: