సినీ నటుడు విక్కీ కౌశల్ గురించి పరిచయం అనవసరం. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాలో విక్కీ ,శంభాజీ మహరాజ్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన డాన్స్ ని ఇటీవల మూవీ మేకర్స్ విడుదల చేశారు. అయితే ఆ డాన్స్ సీక్వెన్స్ వివాదాస్పదంగా మారింది. దానికి డైరెక్టర్ లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఆ డాన్స్ ని సినిమా నుండి తొలగిస్తామని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంపై తాజాగా హీరో విక్కీ కౌశల్ కూడా స్పందించారు. 'మన సంస్కృతిని ప్రపంచానికి చూపించడం కోసం ఆ డాన్స్ పెట్టము. ఈ డాన్స్ ని స్టోరీలో భాగంగా మాత్రమే తీసుకున్నాము. ఈ సినిమా షూటింగ్ లో ప్రతిరోజూ మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ నినాదాలు చేస్తూనే ఉన్నాము. ఓ సారి ఆయన మహారాష్ట్రకు చెందిన లెజిమ్‌ అనే జానపద నృత్యాన్ని వేస్తారు.. అందుకనే మేము స్టోరీలో భాగంగా 30 సెకన్లు మాత్రమే ఆ డాన్స్ ని సినిమాలో యాడ్ చేశాము. దాన్ని కొందరు తప్పుగా అనుకున్నారని.. సినిమా నుండి తొలగించాము.  
 ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. దినేష్ విజన్ ఈ మూవీకి నిర్మాతగా పనిచేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి వీరిద్దరూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా టైలర్ రిలీజ్ వేడుక ముంబాయిలో జరిగింది. ఈ సినిమాలోని 'జానే తూ..' అనే గీతాన్ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు.  
ఇక ఈ సినిమా కోసం విక్కీ తాను శారీరకంగా.. అలాగే మానసికంగా ఎంతగానో శ్రమించనని తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ కి ముందే విక్కీ కత్తి శాము, యుద్దాలు, గుర్రపు స్వారీలలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పాడు. వీటన్నింటి కంటే కూడా శంభాజీ మహారాజ్‌ పాత్రలో నటించడంమానేది.. ఆ పాత్రకు తగ్గట్లుగా తన మనసును సిద్ధం చేయడం అనేది తనకు సవాల్ గా మారిందని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: