![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/cinema-02a6d5b4-ae3a-4f39-8c1c-86c14712bfec-415x250.jpg)
ఈ సినిమా ఎంతగానో ప్రేమించుకున్న ఒక జంట ఎడబాటుకు గురి అయితే పడే బాధను, ప్రేమను ప్రతిబింబిస్తుంది. సినిమా బాగుంది.. ఒకసారి చూసి ఎంజాయ్ చెయ్యచ్చు అంటూ ఆడియన్స్ కామెంట్స్ లో పెడుతున్నారు. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి చాలా బాగా నటించారు. వారిద్దరి పాత్రలు, నటన చాలా సహజంగా ఉంది అంట. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల నటనతో పాటు DSP అందించిన అద్బుతమైన సంగీతం కూడా ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్ గా మారింది. ఈ సినిమా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించారు. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి మరి.
ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా శ్రీకాకుళం యాసలో తెరకెక్కింది. అయితే ఇటీవల సాయి పల్లవి, నాగచైతన్య గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో చైతన్య డాన్స్ చేస్తే, కాస్త వెనకడుగు వేసేవాడని, కానీ ఈ సినిమాలో మాత్రం ఇరగదీశాడాని చెప్పుకొచ్చింది. అంతే కాదు చైతన్య సెట్ లో అబద్దలు చెప్తాడని తెలిపింది. ఎప్పుడు చూడు సెట్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడని తెలిపింది. తాను అక్కడలేని సమయం చూసుకుని.. అందరినీ పిలిచి పల్లవి ఆ సీన్ లో ఇలా చేద్దాం.. అలా చేద్దాం అని అంటుందని చైతన్య అంటాడని చెప్పింది. తన మాట వినగానే ఏం తెలియనట్లు సైలెంట్ గా ఉంటాడని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.