సిల్క్ స్మిత మత్తెక్కించే  కళ్ళతో సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటిగా పేరుపొందిన సిల్క్ స్మిత అప్పట్లో ఎంతోమంది ఆరాధ్య దేవతగా పేరుపొందింది. సిల్క్ స్మిత సినిమాలో ఉందంటే ఆ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకునేదట. అప్పట్లో ఈమె డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం పోస్టుపోన్ చేసుకునే వారట. అంతలా సిల్క్ స్మిత క్రేజ్ ఉండేది.. ఈ రేంజ్ లో సౌత్ సినిమాలో దశాబ్దం నర్రపైగా శాసించినటువంటి సిల్క్ స్మిత మొదటిసారి మలయాళ సినిమా ఒట్టపట్టేవార్ అనే చిత్రం ద్వారా సిల్క్ స్మిత ఎంట్రీ ఇచ్చింది..


అలా మొదటిసారి ఆమెకు వరుసగా ఏడు సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకున్నదట. ఒక తమిళ సినిమా ఆరు మలయాళ సినిమాలలో నటించినటువంటి ఈమె ఆ తర్వాత సీతాకోకచిలుక అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. అలా పదహారేళ్ల పాటు గట్టిగా రాణించిన ఈమె తన కెరియర్లో 350కు పైగా చిత్రాలలో నటించిందట సిల్క్ స్మిత. అలా సిని ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిక వెలిగిన ఈమె నిజజీవితంలో మాత్రం ప్రేమ అనే మోసానికి గురై బలయిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.


 సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.. ఈమె కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఈమె మరణం వెనుక ఇప్పటికీ ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయి.. సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఒక స్టార్ హీరో కి కాల్ చేసిందనే విధంగా తెలుస్తోంది..ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారట..ఆయన ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్..1992లో ఈయన నటించిన హళ్లి మేస్త్రు సినిమాలో సిల్క్ స్మిత నటించినప్పటినుంచి చనిపోయే వరకు ఈ నటుడితో మంచి స్నేహబంధం ఉండేదని.. సిల్క్ స్మిత చనిపోయే ముందు తనకి ఫోన్ చేసిందని కానీ తాను సినిమా షూటింగ్లో ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోయానని వెల్లడించారు.ఒకవేళ ఆరోజు ఫోన్ లిఫ్ట్ చేసి ఉందంటే మరొక లాగా ఉండేదేమో అన్నట్లుగా తెలిపారు. అలా ఫోన్ లిఫ్ట్ చేయనందుకు ఇప్పటికీ తాను గిల్టీగా  ఫీల్ అవుతున్నారు అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: