![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/movie-d0b5042f-27c8-415e-8080-c884d3048419-415x250.jpg)
ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా శ్రీకాకుళం యాసలో తెరకెక్కింది. ఈ సినిమా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించారు.
అయితే ఇదిలా ఉండగా.. తండేల్ మూవీ నార్త్ ఇండియా లో అల్లు అర్జున్ నటించిన పుష్ప, ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి సినిమాల టికెట్ ధరలను బీట్ చేసింది. ఈ సినిమా టికెట్ ధర రూ. 200 ఉంది. దీంతో నెటిజన్స్ కల్కి, దేవర, పుష్ప సినిమాలకు కూడా టికెట్ ధరలు ఇంత లేవు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి మరి. ఈ సినిమాపై మొదటి నుండే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉండే.. ఇక ఇప్పుడు ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తుంది.