![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/heroes90816e7d-bd40-4271-a9fd-93fa00dbad9f-415x250.jpg)
నాగచైతన్య ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు . తన బాడీ మాడ్యూలేషన్ కూడా మార్చేశాడు . తన యాస కూడా మార్చేసి చాలా డిఫరెంట్గా ఈ సినిమా కోసం ప్రమోషన్స్ కూడా చేశారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంలో నాగచైతన్య పాత్ర కూడా చాలా ఉంది . కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా హీరోయిన్ సాయి పల్లవి గురించి మొదటి మాట్లాడుకుంటున్నారు. ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ .. ఆమె డైలాగ్ డెలివరీ.. ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగున్నాయి అంటూ పొగిడేస్తున్నారు .
దీంతో ఈ సినిమా హిట్ అయినా సరే నాగచైతన్యకు ఆనందం లేకుండా పోయింది. అంతేకాదు గతంలో " మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ " సినిమా హిట్ అయినప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది . అఖిల్ అక్కినేని
సినిమా హిట్ అయిన ఆయన పేరు మాత్రం ఎవ్వరూ మాట్లాడుకోలేదు . అందరు పూజా హెగ్డే పేరే మాట్లాడుకుంటూ వచ్చారు. సేమ్ సీన్ మళ్లీ రిపీట్ అయింది. తండేల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా నాగచైతన్య గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోవడం లేదు. ముందుగా హీరోయిన్ సాయి పల్లవిని అందరు గుర్తు చేసుకుంటున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు నాగచైతన్య తండేల్ సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . చూద్దాం మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో..???