అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని ఉంది అంటే ఇదే కాబోలు . పాపం నాగచైతన్య ఇన్నాళ్లు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురయ్యారు . కొన్నిసార్లు ప్రత్యక్షంగా మరికొన్నిసార్లు పరోక్షంగా తన తప్పు లేకపోయినా సరే సోషల్ మీడియాలో బూతులు తిట్టించుకున్నారు . మరీ ముఖ్యంగా సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఆయనపై ఎలాంటి నిందలు పడ్డాయి..? ఎలాంటి ట్రోలింగ్ జరిగింది ..? అన్న విషయం ఎప్పటికీ మర్చిపోలేము . ఆయన కెరియర్ బాగా బాగా డౌన్ ఫాల్ అయింది . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే సమంత - నాగచైతన్య లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేదు . అసలు ఆయనని హీరోగా ఇండస్ట్రీలో ఎవరో గుర్తించలేదు.


అలాంటి హీరో ఎంతో కష్టపడి ఇష్టంగా నటించిన సినిమా "తండేల్" . ఈ సినిమాపై మొదటి నుంచి జనాలకి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.  అనుకున్నట్టే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.  కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా నాగచైతన్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గా నిలిచిపోతుంది అంటున్నారు అభిమానులు.  నాగచైతన్య పర్ఫామెన్స్ వేరే లెవెల్ అంటూ పొగిడేస్తున్నారు . అయితే నాగచైతన్య నటించిన "తండేఅల్" సినిమా సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ.. ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు నాగచైతన్య అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .



దానికి కారణం శొభిత ధూళిపాళ్ల  రీసెంట్ గానే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్య . అయితే ఆమెను ముద్దుగా బుజ్జి తల్లి అంటూ పిలుచుకుంటూ వస్తాను అని సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు . నిజానికి ఈ సినిమాలో రీల్ క్యారెక్టర్ లో సాయి పల్లవి పేరు కూడా బుజ్జి తల్లినే . అయితే సినిమాలో సాయి పల్లవి - నాగచైతన్య కెమిస్ట్రీ చూసిన తర్వాత రియల్ లైఫ్ కన్నా రీల్ లైఫ్ నే బాగుంది అని.. శోభిత ధూళిపాళ్ళ కన్నా సాయి పల్లవి - నాగచైతన్య స్క్రీన్ ప్రజెన్స్ కెమిస్ట్రీ బాగా బాగా వర్కౌట్ అయింది అని .. అసలు సాయి పల్లవిని రెండో పెళ్లి చేసుకొని ఉండొచ్చుగా అంటూ కూడా జనాలు మాట్లాడుతున్నారు. దీంతో "తండేల్" సినిమా హిట్ అయిందని ఎంజాయ్ చేయాలా..? లేకపోతే ఫ్యాన్స్ ఈ విధంగా కామెంట్స్ పెడుతున్నందుకు బాధపడాలా..? అర్థం కాని అయోమయ సిచ్యువేషన్ లో ఉండిపోయాడు నాగచైతన్య.  ఇది నిజంగా నాగచైతన్య మ్యారీడ్ లైఫ్ కి బిగ్ నెగిటివ్ కామెంట్ అనే చెప్పాలి . చూద్దాం మరి నాగచైతన్య ఇలాంటి కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతాడో..??

మరింత సమాచారం తెలుసుకోండి: