
అయితే శోభితతో వివాహం తర్వాత నాగ చైతన్య నుంచి వచ్చిన ఫస్ట్ సినిమా తండేల్. ఈ సినిమా ద్వారా చైతన్య మంచి సక్సెస్ అందుకునేలా ఉన్నారు. దీంతో శోభిత రాకతో చైతన్యకు మొదటి విజయం వచ్చేలా ఉందని అంటున్నారు. శోభిత రాకతో చైతన్య కెరీర్ పూర్తిగా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు పాజిటివ్ స్పందన వస్తున్న నేపథ్యంలో మరోవైపు శోభిత తన అభిమానులకు ఓ విషయాన్ని తెలియజేసింది.
తండేల్ సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర బృందానికి శోభిత శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. తండేల్ సినిమా విడుదలైన నేపథ్యంలో చాలా సంతోషంగా ఉన్నానని శోభిత అన్నారు. తండేల్ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నువ్వు చాలా పాజిటివ్ గా, ఫోకస్డ్ గా కనిపించావు. అందరితో పాటు నేను ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఎదురు చూడలేకున్నా అంటూ శోభిత తన భర్త చైతన్య గురించి రాసుకొచ్చింది.
అయితే ఆమె మరో విషయాన్ని కూడా షేర్ చేసుకుంది. ఫైనల్ గా చాలా రోజులకి నువ్వు గడ్డం షేవ్ చేసుకున్నావు. మొదటిసారి నీ ముఖం గడ్డం లేకుండా దర్శనం అవుతుంది సామి అంటూ శోభిత తన సంతోషాన్ని వెల్లడించింది. శోభిత పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా ఈ విషయంపై పలువురు అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.