![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/the-wife-who-posed-for-the-cameras-star-singer-shocking-commentscd54535d-0522-4422-a55c-e00291bfa705-415x250.jpg)
ఈ నేపథ్యంలోనే 2025 గ్రామీ అవార్డుల వేడుకలో ఈసారి అందరి దృష్టిని ఆకర్షించిన వారిలో కాన్యే వెస్ట్ రెండో భార్య అయినటువంటి "బియాంకా సెన్సోరి" ఒకరు. మోడలింగ్ ప్రపంచంలో ఆమె ఓ పెద్ద సెన్సేషన్. అయితే తాజాగా జరిగిన గ్రామీ అవార్డుల్లో నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి, రాత్రికి రాత్రి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఈ క్రమంలో ఆమెని కొంతమంది విమర్శలు చేసినప్పటికీ మరికొంతమంది ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొంతమంది ఒక ఇంటర్నేషనల్ వేదికపై బట్టలు లేకుండా షో చేసిన ఈ బియాంకా సెన్సోరి ఎవరు? కాన్యే వెస్ట్ ని ఆమె ఎలా కలిసింది? అనే విషయాలపై ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఆమె ఒక అమెరికన్ పాపులర్ ర్యాపర్. ప్రొడ్యూసర్ కాన్యే వెస్ట్ ను రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బియాంకా సెన్సోరి వార్తల్లో నిలుస్తోంది. అయితే వీరిద్దరూ అఫీషియల్ గా పెళ్లి చేసుకోలేదని రూమర్స్ ఉన్నాయి. అవును... కాన్యే వెస్ట్ ను పెళ్లి చేసుకోక ముందు బియాంక ఎవరు? అనే విషయం ఎవరికీ తెలియదు. పెళ్లికి ముందు ఆమె ఆస్ట్రేలియాలో ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేసేది. అక్కడే బియాంక, కాన్యే కలుసుకున్నారు. సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం, బియాంకా మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ డిగ్రీని పొందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బియాంక వయసు 30 ఏళ్లు. చిన్నతనంలోనే క్రియేటివిటీ పై మంచి ఆసక్తి ఉండడంతో ఆమె శిల్పి కావాలని అనుకొనేవారట. కానీ ప్రస్తుతం ఆమె హాలీవుడ్లో టాప్ మోడల్ అని చెప్పొచ్చు. ఇక గ్రామీ అవార్డ్స్ 2025లో కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి, ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారింది.