![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/business_videos/allu-aravinda65fca1c-5687-45da-9c74-5d9ec238ad0b-415x250.jpg)
ఈ ఈవెంట్ లో చిత్ర బృందం అందరూ కలిసి సందడి చేశారు. ఇందులో అల్లు అరవింద్ మాట్లాడుతూ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. సాయి పల్లవి నటనను ఎంతగానో మెచ్చుకున్నారు. నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా తెలంగాణలో టికెట్ ధరల పెంపు విషయంపై అల్లు అరవింద్ కొన్ని కామెంట్ చేశారు. తెలంగాణలో టికెట్ల ధర పెంచమని మేము ఎప్పుడూ అడగలేదని అన్నారు.
దానికి గల ప్రధాన కారణం తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు పెరిగి ఉన్నందున వాటిని పెంచమని మేము అడగలేదని అన్నాడు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో రూ. 50 రూపాయలు మాత్రమే పెంచమని రిక్వెస్ట్ చేశాము అంతే. బెనిఫిట్ షోలు కూడా మాకు అవసరం లేదు. అంటూ అల్లు అరవింద్ కామెంట్స్ చేశాడు. దీంతో తెలంగాణ సర్కార్ పై అల్లు అరవింద్ ఇలా మాట్లాడడంపై కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.
కాగా, ఈ సినిమా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమాను చూడడానికి అభిమానులు థియేటర్ల వద్ద భారీ సంఖ్యలో ఉన్నారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. సాయి పల్లవి నటనను మెచ్చుకుంటున్నారు.