నాగచైతన్య తన సినీ కెరీర్ లో జోష్ సినిమా నుంచి భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ ను కొనసాగిస్తూ వచ్చారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేని చైతన్య అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయిపల్లవి తండేల్ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రాజు అనే మత్స్యకారుని జీవితంలో చోటు చేసుకున్న ఊహించని ఘటనలతో తండేల్ మూవీ తెరకెక్కగా అక్కినేని ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా నచ్చేసింది.
 
కథ :
 
బాల్యం నుంచి రాజు (చైతన్య) సత్య ( సాయిపల్లవి) ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలుగా బ్రతుకుతారు. చేపల వేటకు వెళ్లి అక్కడ సంపాదించిన డబ్బులతో రాజుతో పాటు మచ్చలేశం గ్రామవాసులు జీవనం సాగించేవారు. బుజ్జితల్లి ఒకానొక సమయంలో కీడు శంకించి రాజును వేటకు వెళ్లొద్దని చెప్పగా రాజు మాత్రం అమె మాట వినకుండా వేటకు వెళ్తాడు. రాజుతో పాటు మొత్తం 22 మంది మత్య్సకారులు చేసిన పొరపాటు వల్ల పాకిస్తాన్ నావీ అధికారులకు చిక్కుతారు.
 
ఆ తర్వాత రాజు జీవితంలో చోటు చేసుకున్న ఘటనలు ఏమిటి? పాక్ జైలులో రాజుకు మిగతా 21 మందికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
 
విశ్లేషణ :
 
చందూ మొండేటి మంచి కథనే ఈ సినిమా కోసం ఎంచుకున్నా కథ మెప్పించిన స్థాయిలో కథనం లేకపోవడం గమనార్హం. ఫస్టాఫ్ వరకు మ్యాజిక్ చేసిన చందూ మొండేటి సెకాండాఫ్ విషయంలో మాత్రం గాడి తప్పారు. చందూ మొండేటి స్క్రిప్ట్ విషయంలో మరింత వర్క్ చేసి ఉంటే మాత్రం సినిమాకు ప్లస్ అయ్యేదని చెప్పవచ్చు.
 
నాగచైతన్య తండేల్ సినిమా కోసం కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. సాయిపల్లవి కెరీర్ బెస్ట్ రోల్స్ లో తండేల్ మూవీ ఒకటిగా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాలలో తండేల్ ఒకటి అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం పని చేసిన మిగతా సాంకేతిక నిపుణులు సైతం తమ పరిధి మేర మెప్పించారు. బన్నీవాసు చెప్పినట్టు ఈ సినిమా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కింది.
 
ప్లస్ పాయింట్స్ : చైతన్య సాయిపల్లవి కెమిస్ట్రీ, ఇంటర్వల్, క్లైమాక్స్, దేవిశ్రీ మ్యూజిక్
 
మైనస్ పాయింట్స్ : స్లోగా సాగే సెకండాఫ్, కొన్ని బోరింగ్ సన్నివేశాలు, పాక్ బ్యాక్ డ్రాప్ సీన్లు
 
రేటింగ్ : 2.75/5.0


మరింత సమాచారం తెలుసుకోండి: