ఏ ఇండస్ట్రీలో నైనా సరే అందం అభినయం ఉంటే కచ్చితంగా అవకాశాలు వస్తాయి. మరి కొంతమంది అలా ఉన్నప్పటికీ అవకాశాలు రాక ఎదురుచూసిన సందర్భాలు చాలానే ఉన్నాయని హీరోయిన్స్ తెలియజేసిన వారు కూడా ఉన్నారు. మరి కొంతమంది అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు అలాంటి వారిలో హీరోయిన్ పూనమ్ బజ్వా కూడా ఒకరు.. కోలీవుడ్ లో పలు చిత్రాలలో నటించి సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత కన్నడ, మలయాళం ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేసింది అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది ఈ అమ్మడు.


అయితే ఆ తర్వాత ఒక డైరెక్టర్ ని రహస్యంగా వివాహం చేసుకొందనే విధంగా వార్తలు వినిపించాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడ సినిమాలలో కూడా కనిపించలేదు పూనమ్ బజ్వా.. నవదీప్ నటించిన మొదటి సినిమా  తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత నాగార్జున బాస్, అల్లు అర్జున్ పరుగు వంటి చిత్రాలలో కూడా నటించింది. అలా తెలుగులోనే కాకుండా పలు చిత్రాలలో నటించిన ఈ అమ్మడు చివరిగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది.


ప్రస్తుతం అవకాశాలు లేక సోషల్ మీడియాలోనే తన సమయాన్ని గడిపేస్తూ ఉన్న పూనమ్ బజ్వా నిరంతరం గ్లామర్ ఫోటోలతో అలరిస్తూ ఉంటుంది. ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన సునీల్ రెడ్డితో పూనమ్ కి రహస్యంగా వివాహం జరిగిందనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ఈయన ఓం త్రిడి అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. అయితే ఈ డైరెక్టర్ తో వివాహం అయిందని విషయం పైన ఇప్పటివరకు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఫోటోలు తెగ వైరల్ గా చేస్తూ ఉన్న ఈ విషయం పైన ఎప్పుడూ కూడా స్పందించలేదు .మరి రాబోయే రోజుల్లోనైనా ఈ విషయం పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి పూనమ్ బజ్వా.

మరింత సమాచారం తెలుసుకోండి: