అసలు విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం .. మీకు ముందు వార్త చెబుతాను చూడండి .. అది చూసి మిగిలిన స్టోరీ అంతా తెలుసుకుందాం .. ఇంతకీ ఏంటా అది అని అనుకుంటున్నారు కదా ? తినబోతూ రుచి ఎందుకు చూడబోతు వివరాలు ఎందుకు ? ముందు ఏంటో చూసేయండి .. చూస్తున్నారుగా రాజమౌళి దరహాసం ! చూశారా మీ హీరోని కూడా నా దగ్గర బంధించేశాను అంటూ కాస్త చిలుపేగా మహేష్ ఫ్యాన్స్ వైపు చూస్తూ నవ్వుతున్నాడు .. ఇక మామూలుగానే మహేష్ కు ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ కు, టూర్స్ కు వెళ్లే అలవాటు ఉంది .. ఇప్పుడు మహేష్ ఎక్కడికి వెళ్లకుండా సీజ్ ది పాస్‌పోర్ట్ అనేసారు జక్కన్న.


ఇక ఇప్పుడు దీనిపై మీమ్స్‌ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి .. రాజమౌళి అలా రీల్ షేర్ చేశారు లేదో అప్పుడే సోషల్ మీడియాలో క్రియేటివిటీ భారీ స్థాయిలో మొదలైపోయింది .. మామూలుగానే రాజమౌళి సినిమా అంటేనే జైలుతో సమానం .. ఒకసారి అందులోకి వెళ్లారంటే రెండు మూడు సంవత్సరాలు వరకు హీరోలు బయటకు వచ్చి మామూలు ప్రపంచాన్ని చూడటం కుదరదు .. ఇక ఎప్పుడూ మహేష్ బాబు వంతు వచ్చింది .. రాజమౌళి ఈ వీడియోకు మహేష్ బాబు నుంచి కూడా భారీ కౌంటర్ కూడా వచ్చింది ..


నేనొక్కసారి కమిటైతే నా మాట నేనే  విననంటూ కూడా రిప్లై ఇచ్చాడు మహేష్ .. అంటే రాజమాలి ఏం చేసినా అన్నిటికి రెడీ అంటున్నాడు ఈ సూపర్ స్టార్  .. ఇప్పటికే రాజమౌళి , మహేష్ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైపోయింది RFC లో ఇప్పటికి పలు కీలక సన్నివేశాలను తెర్కక్కించాడు రాజమౌళి .  అదే విధంగా ఈ సినిమాలో   విలన్ గా గ్లోబ‌ల్ బ్యూబి ప్రియాంక చోప్రా నటిస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి .. అలాగే మహేష్ కు జంటగా ఈ సినిమాలో ఓ హాలీవుడ్ హీరోయిన్ ఇప్పటికే కన్ఫర్మ్ అయిందట .. సమ్మర్ తర్వాత హీరోయిన్ తో మహేష్ బాబు షూటింగ్ను ప్రారంభిస్తారని కూడా అంటున్నారు. ఇక మరి రాజమౌళి - మహేష్ తో గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: