తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి సినిమాల తర్వాత భారీ పాన్ ఇండియా మూవీగా వస్తున్నా సినిమాల్లో నాగా చైతన్య తండేల్‌ మూవీ కూడా ఒకటి .. కార్తికేయ 2 తో సాలిడ్ పాన్ ఇండియా హీట్ అందుకున్న దర్శకుడు చందు మొండేటి టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు .. ఇక తండేల్ రిలీజ్ కి ముందే టీజర్ , పాటలు , ట్రైలర్ తో ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకుంది .. ఇక ఇప్పుడు ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది .


మొదటి ఆట నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి భారీ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది . ప్రధానంగా ఈ సినిమాలో వచ్చిన పాటలు , బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా ను మరో స్థాయికి తీసుకువెళ్లిందని అంటున్నారు . అలాగే ఈ సినిమా తో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఇస్ బ్యాక్ అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు .. అలాగే సాయి పల్లవి మరోసారి తన నటన తో ఏడిపించేసింది .. నాగ చైతన్య కూడా తన కెరియర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో సినిమా విజయం లో కీలకపాత్ర పోషించాడు .


ఇలాంటి ఈ భారీ  సినిమాకు రిలీజ్ కు ముందే తెలుగు రాష్ట్రాల్లోనూ ఓవర్సిస్ లోనూ మంచి బుకింగ్స్ ని చూపించింది . ఇలా మొత్తం గా మంచి ట్రెండ్ లో అయితే సాలిడ్ ఓపెనింగ్స్ తో ఈ సినిమా నిలవబోతుందని తెలుస్తుంది . ఇక ఈ సినిమాకు వచ్చిన టాక్ తో మొదటి రోజు ఈ సినిమాకి 30 కోట్ల వరకు గ్రాస్ వస్తుందని సినీ విశ్లేషకులు , అభిమానులు అంచన‌వేస్తున్నారు .. ఇక మరి చూడాలి తండేల్‌ రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్ తో చరిత్ర తిరగ రాస్తాడు అనేది చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: