చాలాకాలం తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ హీరో సినిమాకు ఈ స్థాయిలో పాజిటివ్ బజ్ రావడం కూడా ఇదే మొదటిసారి .. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జంటగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటిస్తుంది .. అమరాన్ లాంటి పాన్ ఇండియ హిట్ తర్వాత సాయి పల్లవి నుంచి వస్తున్న రెండో సినిమా .. ఇక ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్ అమెరికా మార్కెట్లో కూడా సాలిడ్ ఓపెనింగ్ తో అదరగొట్టబోతుంది . ఇప్పటికే అన్నిచోట్ల మొదటి షో లు కంప్లీట్ చేసుకున్న తండెల్ .. ఎక్కడ చూసిన హిట్ టాక్ తెచ్చుకుంది ..
ప్రధానంగా ఈ సినిమాలో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు అదిరిపోయాయని .. డీఎస్పీ కం బ్యాక్ అంటూ అందరూ కామెంట్ లో పెడుతున్నారు .. అలాగే సాయి పల్లవి మరోసారి తన నటనతో ఏడిపించిందని కూడా అంటున్నారు. నాగచైతన్య కూడా తన కెరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ తో మెప్పించాడట .. దీంతో తండేల్ రెస్పాన్స్ అదిరిపోయిందని అంటున్నారు .. ఇక ఈ సినిమాను నిజజీవిత సంఘటనను ఆధారంగా తెరకెక్కించారు .. అయితే ఈ సినిమా యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ తోనే రెండు లక్షల పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు .. ఇదే హిట్ టాక్ కొనసాగితే తండేల్ ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్లు రాబడటం ఖాయం.