నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రెసెంట్ టాలీవుడ్ లోనే సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు .  బ్యాక్ టు బ్యాక్ వరుస‌ విజయాలు అందుకుంటూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు .. అలాగే ఈ నందమూరి హీరోను పద్మభూషణ్‌ కూడా వరించింది . అన్ని రంగాల్లో సూపర్ ఫామ్ లో  దూసుకుపోతున్నాడు .. లేటెస్ట్ గా కడాకు మహారాజ్‌తో మరోసారి భారీ హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే .. అలాగే ఈ సినిమా హిట్‌కు ముందు బాలయ్య 2.0 కి పునాది వేసిన స్పెషల్ హిట్ మూవీ అఖండ అనే చెప్పాలి ..


బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ మూవీ బాలయ్య కి ఊహించిన లెవెల్ లో కం బ్యాక్ ఇవ్వడమే కాకుండా అక్కడి నుంచి వరుస విజయాలతో బాలయ్యని ఫామ్ లోకి వచ్చేలా చేసింది . ఇక ఇప్పుడు దీనికి సీక్వల్గా అఖండ 2 తాండవం రాబోతుంది .. ఇక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలను నెలకొన్నాయి .. అయితే ఈ పార్ట్ 2 షూటింగ్ ప్రజెంట్ జరుగుతున్న మహా కుంభమేళాలో మొదలు పెట్టిన విషయం తెలిసిందే .. ఇలా ఓ నిజమైన కుంభమేళాలో స్టార్ట్ అయిన ఈ సినిమాపై తాజాగా పార్ట్ వన్ మాస్‌ క్రేజ్ మరోసారి ఊపొ అందుకుంది ..


కుంభమేళలో అఖండ బాలయ్య పెయింటింగ్ తో కూడిన వెస్ట్ బెంగాల్ బస్సులు దర్శనమిచ్చాయి ...ఇక దీంతో ఇవి సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారాయి .. మొదటి భాగానికి హిందీ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఇక ఇప్పుడు పార్ట్ 2 కూడా నార్త్ ఆడియన్స్ లో భారీ రేంజ్ లో వర్క్ ఔట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారురు .. బాలయ్య కెరీర్ లోనే తొలి పాన్‌ ఇండియా సినిమాగా అఖండ 2 తెరకెక్కుతుంది .. ఇక ఈ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వటం కాయం.




మరింత సమాచారం తెలుసుకోండి: