మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ సినిమా స్థాయికి తీసుకువాలన్న‌ దర్శకులలో రాజమౌళి అందరికంటే ముందు వరుసలో ఉంటారు .. రాజమౌళి దగ్గర్నుంచి వచ్చిన సినిమాలలో బాహుబలి , త్రిబుల్ ఆర్ సినిమాలు అంతర్జాతీయ స్థాయి లో తెలుగు సినిమాని ఊహించని రేంజ్ కి తీసుకువెళ్లాయి .. అయితే ఈ పాన్ ఇండియా ట్రెండ్‌ బాహుబలి సినిమాతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు జక్కన్న. అయితే ఈ సినిమా కంటే ముందే ఓ సినిమా అని రాజమౌళి పాన్ ఇండియా సినిమా గా రిలీజ్ చేయాలని ఎంతో ప్రయత్నం చేశానని అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.


ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు మగధీర .. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలోనే కనివిని ఎరగని వసూలతో రికార్డులు తిరగరాసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది .. అలాగే ఈ సినిమా అప్పుట్లో ఒక సంచలనంగా మారింది . కానీ ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో డబ్‌ చేద్దామని తన నిర్మాత అల్లు అరవింద్ ని చాలా కన్విన్ చేసేందుకు ప్రయత్నించా ని అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి .


తన పాన్ ఇండియా ఆలోచన బాహుబలి నుంచి వచ్చింది కాదు .. మగధీర టైంలోనే ఇతర భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేద్దాం అని నా నిర్మాతని అడిగాను .. అర్ధించాను కూడా కానీ ఎందుకు ఆయన అందుకు ఒప్పుకోలేదంటూ ఇటీవల ఓ కార్యక్రమంలో రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి .. మరి అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాా నిర్మాత కారణంగా రీజినల్ సినిమాగా ఆగిపోవాల్సి వచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: