తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. వెంకటేష్ ఇప్పటివరకు అనేక సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. కానీ గత కొంత కాలంగా వెంకటేష్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం లేదు. అలాంటి సమయంలోనే వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇకపోతే ఈ మూవీ మరీ ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తూ అద్భుతమైన జోష్ లో ముందుకు దుసుకుపోతుంది. ఇకపోతే సీడెడ్ ఏరియాలో వెంకీ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో చిరంజీవి రికార్డులను క్రాస్ చేస్తూ వెళుతున్నాడు. సీడెడ్ ఏరియాలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంటే ముందు చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా 18.35 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలో కొనసాగుతూ వచ్చింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా తాజాగా సీడెడ్ ఏరియాలో 18.40 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకోగా , వాల్టేరు వీరయ్య సినిమా పదవ స్థానానికి పడిపోయింది.

ఇక ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా సీడెడ్ ఏరియాలో 19.11 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుంది. మరి సంక్రాంతి వస్తున్నాం సినిమాకి ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే సైరా నరసింహారెడ్డి సినిమా రికార్డును కూడా సీడెడ్ ఏరియాలో వెంకీ తన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో క్రాస్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: