కూతురు పెళ్లి అనగానే ఎంతో మంది భారీ ఎత్తున భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. ఎంతో కాలం పాటు పెంచి పెద్ద చేసిన అమ్మాయిని వేరే ఇంటికి పంపే సమయంలో తల్లిదండ్రులు భావోద్వేగానికి గురవడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అనురాగ్ కశ్యప్ ఒకరు. ఇకపోతే కొంత కాలం క్రితమే అనురాగ్ కశ్యప్ తన కుమార్తె ఆలియా వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశాడు. అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకుంది.


 ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు ఫుల్ గా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయన తన కుమార్తె ఆలియా వివాహం సమయంలో ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా ఈ దర్శకుడు మాట్లాడుతూ ... తన కుమార్తె ఆలియా వివాహ సమయంలో తాను ఎంతో బావోద్వేగానికి గురయ్యాను అని , పెళ్లి జరుగుతున్న సమయంలో తాను బాధను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని , ఆ బాధను కంట్రోల్ చేసుకోలేక పెళ్లి మధ్యలో నుండి బయటకు వెళ్లి పోదాం అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. 


అలాగే పెళ్లి తర్వాత కూడా 10 రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నట్లు , ఆ బాధ నుండి బయటపడడానికి తనకు దాదాపు పది రోజుల సమయం పట్టినట్లు తాజాగా ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు. అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా ఒక విదేశీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు ఆలియా తన భర్త చాలా కాలం పాటు డేటింగ్ చేసి ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాత వివాహ బంధంతో ఒకటి అయ్యారు. ఇక వీరిద్దరి వివాహాన్ని అనురాగ్ కశ్యప్ దగ్గరుండి ఎంతో ఘనంగా చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: