సీడెడ్ ఏరియాలో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవి ..? అందులో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ ప్లేస్ లో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 51.04 కోట్ల కలెక్షన్లతో సీడెడ్ ఏరియాలో ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ 35.70 కోట్ల కలెక్షన్లతో ప్రస్తుతం రెండవ స్థానంలో కొనసాగుతుంది.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా 34.75 కోట్ల కలెక్షన్లతో 3 వ స్థానంలో కొనసాగుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ 31.85 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ పార్ట్ 1 మూవీ 22.75 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో కొనసాగుతుంది.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి పార్ట్ 1 సినిమా 21.8 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో కొనసాగుతుంది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా 21.80 కొత్త కలెక్షన్లతో 7 వ స్థానంలో కొనసాగుతుంది.

చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా 19.11 కోట్ల కలెక్షన్లతో 8 వ స్థానంలో కొనసాగుతుంది.

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా ఇప్పటికే 18.40 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లను వస్తూ ఉండడంతో ఈ మూవీ మరిన్ని కలెక్షన్లను కూడా వసూలు చేసి ముందు స్థానాల్లోకి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

చిరంజీవి హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా 18.35 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: