నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజు అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేశారు.

ఇకపోతే బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ , వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలు మంచి విజయాలు సాధించి ఉండడం ,  బాబి కొల్లి ఆఖరుగా దర్శకత్వం వహించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఉండడం , అలాగే డాకు మహారాజు సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు కూడా సూపర్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. ఇకపోతే ఈ మూవీ కి నైజాం ఏరియాలో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ నైజాం ఏరియాలో 17.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమాకు నైజాం ఏరియాలో 15.35 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబందించిన బాక్స్ ఆఫీస్ రన్ ఆల్మోస్ట్ నైజాం ఏరియాలో ముగిసింది అని అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దానితో ఈ సినిమాకు నైజం ఏరియాలో 2.5 కోట్ల మెట్ల లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: