![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestyle388d6dc1-5253-49b2-9ba3-6254e5a1cd98-415x250.jpg)
మొదటిసారి తన కథ కాకుండా మరో దర్శకుడు కథతో తను సినిమా చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా ఈ సినిమా బాగున్నప్పటికీ సోషల్ మీడియాలో భారీ ఎత్తున నెగిటివ్ నడిచింది.అయితే సుదీర్ఘ కాలంగా శంకర్ భారీ తనం నిండిన సినిమాలకు పని చేసారు. ఇలాంటి సమయంలో అతడు బ్లాక్ బస్టర్ ని, చాలా తక్కువ బడ్జెట్ తోనే సాధించాలి. అయితే చిన్న బడ్జెట్ సినిమాని వీఎఫ్ ఎక్స్- గ్రాఫిక్స్ ఉపయోగించని సినిమాని ఆయన చేస్తారా? అంటే సందిగ్ధత కనిపిస్తోంది. అయితే శంకర్ లాంటి దర్శకుడు ఎక్కడ తప్పు చేస్తున్నారు? అంటే.. ఎంపిక చేసుకునే కథాంశం, స్క్రిప్టు మ్యాటర్ లోనే ప్రాబ్లెమా? లేక దర్శకుడిగా ఆయన ఆలోచనా విధానం ఆశించిన రేంజుకు రీచ్ కావడం లేదా? అన్నదానిని విశ్లేషిస్తున్నారు.ఇలాంటి సమయంలో శంకర్ కి తిరిగి తన తొలి నాళ్లలో సహకరించిన లెజెండరీ రచయిత, ది గ్రేట్ సుజాత రంగరాజన్ సాయం అవసరమని భావిస్తున్నారు.కానీ సుజాత రంగరాజన్ శంకర్ తెరకెక్కించిన చివరి బ్లాక్ బస్టర్ రోబో చిత్రీకరణ సమయంలోనే మరణించారు.ఈ క్రమంలో ఆయన నిష్కృమించిన తర్వాత శంకర్ కి ఏదీ కలిసి రాలేదు. వరుసగా అన్ని చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. అందుకే ఇప్పుడు సుజాత రంగరాజన్ లాంటి మరో రచయిత పుట్టుకొస్తేనే శంకర్ కి తిగిరి మునుపటిలా విజయాలు దక్కుతాయని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.