నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం వరకు వరుస అపజయాలను ఎదుర్కొన్న బాలయ్య అలాంటి సమయం లోనే తనకు అప్పటికే సింహా , లెజెండ్ మూవీలతో రెండు విజయాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

సినిమా తర్వాత బాలయ్య , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి తాజాగా బాబి కొల్లి దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాల్లో హీరో గా నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య "అఖండ" మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 సినిమాలో హీరో;గా నటిస్తున్నాడు. ఇకపోతే బాలయ్య ఇప్పటికే అఖండ 2 మూవీ తర్వాత సినిమాను కూడా సెట్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే బాలయ్య కు వీర సింహా రెడ్డి మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య అఖండ 2 మూవీ తర్వాత సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాను ఏకంగా ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాహు గారపాటి , సుధాకర్ చెరుకూరి , సతీష్ కీలాలు కలిసి నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా జాట్ అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రస్తుతం జనాల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: