నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. జనరల్ ఆడియెన్స్ సైతం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మోక్షజ్ఞ ఏజ్ మూడు పదుల దగ్గర్లో ఉందని.. ఇంకెప్పుడు ఎంట్రీ ఉంటుందని బాలయ్య ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.మరోవైపు మోక్షజ్ఞ తేజ ఏంట్రీ ఏ దర్శకుడితో ఉండబోతుందా అనే ఆసక్తి కూడా సినీ లవర్స్‌లో మాములుగా లేదు. కాగా హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఉందని అఫీషియల్‌గా రావడంతో... నందమూరీ ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంతా కాదు.ఇప్పటికే స్క్రీప్ట్ లాక్ అయిపోయందని.. అన్ని కుదిరితే ఇదే ఏడాది ప్రాజెక్ట్ పట్టాలెక్కే చాన్స్ ఉందని తెలుస్తుంది. మరోవైపు మోక్షజ్ఞ సైతం మాములుగా మేకోవర్ కాలేదు. రీసెంట్‌గా రిలీజైన ఫోటోల్లో అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.ఇదిలావుండగా ప్రశాంత్ వర్మతో సినిమా అని వార్తలు వచ్చినప్పటికీ అతను డబ్బులు భారీగా డిమాండ్ చేశాడని, తన అసిస్టెంట్ తో సినిమా చేయిస్తానని, తాను దర్శకత్వం వహించనని, కథను మాత్రమే ఇస్తానని ఇలా అనేక రకాలుగా వ్యవహరించడంతో అతనిపై బాలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి రెండు పీకినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ తాజాగా వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తిచేసుకొని త్వరలోనే సెట్స్ పైకి అడుగుపెట్టబోతోంది.

ప్రశాంత్ వర్మ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్శకత్వం వహించనున్నారని, బాలయ్య తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడాలనే ప్రయత్నాల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు నిర్మాత ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో మోక్షజ్ఞకు జోడీగా  శ్రీలీల నటిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే శ్రీలీల వద్దని, మీనాక్షి చౌదరి అయితే బాగుంటుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గోట్, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో బ్లాక్ బస్టర్లను అందుకుందని, తను మోక్షజ్ఞ సరసన హీరోయిన్ అయితే వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. చాలామంది అభిమానులు మాత్రం హీరోయిన్ గా మీనాక్షి చౌదరినే ఖరారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా ఇక ఈ సినిమా బడ్జెట్ అక్షరాల రూ.100 కోట్లని సమాచారం. ఒక డెబ్యూ హీరోకు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ పెట్టడం అంటే మాములు విషయం కాదు. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోనే తెరకెక్కబోతుందట. ఇటీవలే రిలీజైన పోస్టర్‌కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. నందమూరీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: