![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/vishwak-sene2b41c81-c223-4ff0-ac62-0bbad4b85f4a-415x250.jpg)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి వారి నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో విశ్వక్సేన్ ఒకరు. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2017లో తెలుగు సిని ఇండస్ట్రీకి వెళ్లిపోమాకే సినిమాతో పరిచయమయ్యాడు. ఆ సినిమా అనంతరం ఎన్నో సినిమాలలో నటించి విశ్వక్సేన్ తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు.
కాగా, విశ్వక్సేన్ నుంచి రాబోతున్న తదుపరి చిత్రం 'లైలా'. ఈ సినిమాలో విశ్వక్సేన్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. లైలా సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో విశ్వక్సేన్ లుక్ ను చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విశ్వక్సేన్ మొదటిసారిగా తన కెరీర్ లో లేడీ గెటప్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు.
ఈ గెటప్ లో విశ్వక్సేన్ ని చూసి ప్రతి ఒక్క అభిమాని ప్రశంసలు కురిపించారు. చాలా అందంగా ఉన్నారని కామెంట్లు వచ్చాయి. కాగా, విశ్వక్సేన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో విశ్వక్సేన్ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గ్రూపులు, కాంపౌండ్ లు లేవని వెల్లడించారు. మీడియా వాళ్ళు, ప్రేక్షకులే సినిమా ఇండస్ట్రీలో గ్రూపులు ఉన్నాయని అనుకుంటారు అంటూ విశ్వక్సేన్ అన్నారు.
సినిమా ఈవెంట్లకు నందమూరి హీరోలను పిలిచేటువంటి మీరు మెగాస్టార్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలిచారు ఏంటి అని ఓ రిపోర్టర్ అడిగారు. ఆ ప్రశ్నకు విశ్వక్సేన్ స్పందిస్తూ... మెగాస్టార్ కు, మా నాన్నకు PRP పార్టీ నుంచే పరిచయం ఉందని అన్నాడు. ఆ సమయంలో మలక్పేట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారని విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు. దీంతో విశ్వక్సేన్ చేసిన ఈ కామెంట్లతో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గ్రూపులు లేవని వెళ్లడయింది.