టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకునే హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. అందం, నటన ఉంటే మాత్రమే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి. అందం, నటన, అదృష్టం కలగలిపిన హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫిదా సినిమాలో తన నటనకు గాను ఎన్నో ప్రశంసలు అందుకుంది.


ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ ఫేస్ తో, తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం సాయి పల్లవికి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే సాయి పల్లవి ఎంపిక చేసుకుంటుంది. సాయి పల్లవి నుంచి తాజాగా వచ్చిన చిత్రం తండేల్. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.


ఇదిలా ఉండగా... తండేల్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో హీరోయిన్ సాయి పల్లవిని ఇంటర్వ్యూ చేసిన ఓ వీడియోను హీరో నాగ చైతన్య ఎక్స్ లో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ... ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఒంటరిగా సమయాన్ని గడపడానికి ఇష్టపడతాను అంటూ సాయి పల్లవి అన్నారు. అంతే కాకుండా సినిమాలు చూస్తాను, ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటాను. తోటకు వెళ్లి వ్యవసాయం ఎలా ఉందో చూసి వస్తాను. సమయం దొరికినప్పుడు వాట్సాప్ లో మంకీ స్టిక్కర్స్ వాడుతూ ఉంటాను అని సాయి పల్లవి అన్నారు.


అంతేకాకుండా అబ్బాయిల గురించి సాయి పల్లవి ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు. అబ్బాయిలు ఐరన్ చేసుకున్న బట్టలు వేసుకుంటే చాలా ఇష్టమని సాయి పల్లవి అన్నారు. ఫార్మల్ అయినా, క్యాజువల్ అయినా ఐరన్ చేసుకొని వేసుకోండి అని సాయి పల్లవి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. దీంతో సాయి పల్లవి మాట్లాడిన మాటలకు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎక్స్ లో ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ సాయి పల్లవికి ఐరన్ చేసుకున్న బట్టలు వేసుకుంటే ఇష్టమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: