సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సందర్భాలలో ఒకే రోజు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలా విడుదల అయిన సందర్భంలో ఏదైనా సినిమా కాస్త బాలేకపోయినా మరో సినిమా బాగున్నట్లయితే బాగున్న సినిమా వైపే ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపడం వల్ల యావరేజ్ సినిమాలకు కూడా మినిమం కలెక్షన్లు రావు. దానితో మేకర్స్ ఒక పక్క ప్లానింగ్ తో సినిమా సినిమాకు మధ్య కాస్త గ్యాప్ ఉండేలా చూసుకొని సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. అలా విడుదల చేయడం వల్ల యావరేజ్ సినిమాలకు కూడా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇకపోతే ఫిబ్రవరి నెలలో ఒకే రోజు ఏకంగా ఐదుగురు మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తాజాగా దిల్ రూబా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని మ్యూజిక్ పనులు పెండింగ్ ఉండడంతో ఈ మూవీ ని ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే సందీప్ కిషన్ తాజాగా మజాకా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కూడా ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే మంచు మనోజ్ , నారా రోహిత్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా భైరవం అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను కూడా ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ మూడు సినిమాలు కనక ఒకే రోజు విడుదల అయినట్లయితే ఈ ఐదుగురు హీరోల సినిమాల మధ్య గట్టి బాక్స్ ఆఫీస్ వారు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: