![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/business_videos/thandel-review51a7c6be-4752-4ce9-8f92-401ab3251fa4-415x250.jpg)
శోభితను వివాహం చేసుకున్న తర్వాత చైతు కెరియర్ పూర్తిగా మారిపోయింది. శోభితతో వివాహం తర్వాత చైతు నుంచి రిలీజ్ అయిన తాజా చిత్రం తండేల్. ఈ సినిమా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో చైతు, సాయి పల్లవితో కలిసి జంటగా నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే రిలీజ్ అయిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో రెండవసారి మీరిద్దరూ కలిసి జంటగా నటిస్తున్నారు. ఈ రోజు రిలీజ్ అయిన తండేల్ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తండేల్ సినిమాకు అభిమానుల నుంచి రెస్పాన్స్ వస్తోంది.
కాగా, వివాహం తర్వాత నాగచైతన్య కెరీర్ లో మొదటి సక్సెస్ రాబోతోందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. శోభిత రావడం వల్ల నాగచైతన్య కెరీర్ పూర్తిగా మారిపోయిందని ఇకనుంచి చైతు లైఫ్ లో అన్ని మంచి రోజులే వస్తాయని అంటున్నారు. తాను చేసే ప్రతి ఒక్క సినిమా విజయాల బాట పడుతుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, తండేల్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో శోభిత సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఇన్ స్టాలో ఓ స్టోరీని రాస్కొచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నానని శోభిత వెల్లడించారు. అంతేకాకుండా తండేల్ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు చాలా పాజిటివ్ గా చైతు ఉన్నాడని చెప్పుకొచ్చారు. చాలా రోజుల తర్వాత నువ్వు గడ్డం చేసుకుంటున్నావు చాలా సంతోషంగా ఉంది సామి అంటూ శోభిత తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ స్టోరీ చూసిన అభిమానులు పాజిటివ్ స్పందిస్తున్నారు.