![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ntr-into-politics-big-sketch-of-nandamuri-s-successor-with-his-wife3ee52d1d-5a6f-4226-a909-fce6ab03c3b5-415x250.jpg)
2009 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన ఎన్టీఆర్.. ఆ తర్వాత పాలిటిక్స్ వైపు చూడలేదు. సినిమా, వ్యాపారరంగంపైనే తన దృష్టిని పెట్టాడు. కానీ, 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత అందరి చూపు ఎన్టీఆర్ పైనే పడింది. టీడీపీ బాధ్యతలను ఎన్టీఆర్ తీసుకోవాలని, ముఖ్యమంత్రిగా ఏపీని ఆయన పరిపాలించాలని అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా కోరుకున్నారు. టీడీపీని ఆదుకునేది ఎన్టీఆరే అన్న చర్చలు కూడా జరిగాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయపై ఇంట్రెస్ట్ చూపలేదు.
ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, నందమూరి ఫ్యాన్స్ కన్ను మాత్రం ఎన్టీఆర్ పైనే ఉంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందే అన్న డిమాండ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తన అభిమానులపై అపారమైన ప్రేమ, గౌరవాన్ని చూపించే ఎన్టీఆర్.. వారి డిమాండ్స్ మేరకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట.
తన పొలిటికల్ కెరీర్ కోసం భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి బిగ్ స్కెచ్ వేశాడట. త్వరలోనే భార్య చేత కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడట ఎన్టీఆర్. ఈ వ్యాపారం ఏపీ ప్రజలకు అవసరాలు తీర్చడమే గాక, తనను ప్రజలతో మమేకం చేస్తూ, తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉండనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమైతే.. నందమూరి అభిమానులు పండుగ చేసుకోవడం ఖాయమవుతుంది. కాగా, ఇటీవల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉద్ధేశించి ఓ ప్రకటన చేశారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకున్న ఆయన.. త్వరలోనే పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తానని, పర్సనల్ గా ఫ్యాన్స్ ను మీట్ అవుతానని వెల్లడించాడు.