తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో కాలం పాటు ఎన్నో సినిమాల్లో కమీడియన్ పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వేణు ఒకరు. ఇకపోతే వేణు కొంత కాలం క్రితం ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా బలగం అనే సినిమాను రూపొందించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా విజయంతో వేణుకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇకపోతే బలగం సినిమా తర్వాత వేణు "ఎల్లమ్మ" అనే టైటిల్ తో నానితో ఓ సినిమా చేయనున్నట్లు దానిని దిల్ రాజు నిర్మించనున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

ఇకపోతే నానికి కథ మొత్తం పూర్తి అయ్యాక వినిపించగా నానిసినిమా కథను రిజెక్ట్ చేసినట్లు , దానితో నితిన్ వద్దకు ఈ కథ వెల్లగా నితిన్ మాత్రం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇక కొంత కాలం క్రితం దిల్ రాజు , నితిన్ హీరోగా వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే టైటిల్ తో మూవీ ని మరికొన్ని రోజుల్లోనే మొదలు పెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ , తమ్ముడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మూవీ లు మరికొన్ని రోజుల్లోనే విడుదల కానున్నాయి. ఇకపోతే నితిన్ హీరోగా వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందబోయే ఎల్లమ్మ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి ఎండింగ్లో లేదా మార్చి లో ఎల్లమ్మ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఉండబోతున్నట్లు , ఇక ఏప్రిల్ లేదా మే నెల నుండి ఈ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే వేణు ఈ సినిమాలో నితిన్ ను సరికొత్త లుక్ లో చూపించేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: