![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestyle2eb8707a-80b1-47aa-98f8-b0d83c1a426c-415x250.jpg)
వెంటనే మహేష్ డేట్లు ఇస్తాడా? వెకేషన్ పరిస్థితి ఏంటి? ప్రభాస్ తన 5 ఏళ్ల పీక్ కెరీర్ ని రాజమౌళి కి సమర్పించుకున్నట్లు మహేష్ సమర్పించుకుంటాడా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
అయితే ఈ వార్తల్లో ఎంతో నిజం ఉందొ తెలీదు కాని రాజమౌళి విజన్ ని సంశయించలేము. దీంతో మహేష్ అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఇదిలా ఉండగా రాజమౌళి 'SSMB 29' కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులతో చిత్రబృందం నాన్-డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులు కాకుండా చిత్ర బృందం భారీగా ప్లాన్ చేసింది. ఈ సినిమాని దుర్గ బ్యానర్ పై KL నారాయణ నిర్మిస్తున్నారు.ఇక రాజమౌళి ఏ ప్రాజెక్ట్‌కైనా తన ప్లానింగ్ పరంగా కచ్చితమైన రూట్‌లోనే ముందుకెళతారు. కానీ, ఈ సినిమా మల్టీపార్ట్ ప్రాజెక్ట్ అవుతుందా? లేక సింగిల్ పార్ట్‌గా అనుకున్న విధంగా రాబోతుందా? అన్నది అధికారిక క్లారిటీ వచ్చేంత వరకు ఉత్కంఠ కొనసాగేలా ఉంది.ఇదిలావుండగా ఇటీవల SSMB29 గురించి కొత్త టాక్ ఒకటి బయటకి వచ్చింది. మహేష్ బాబుతో జోడీగా ప్రియాంక చోప్రా కనిపిస్తారని అంతా అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటించనున్నారని మూవీ యూనిట్ ముందే హిట్ ఇచ్చినా, ఇప్పుడు ఆయన స్థానంలో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం తీసుకోవచ్చని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికి ఈ విషయాలనింటికి త్వరలోనే ఎండ్ కార్డు పడనునట్లు సమాచారం.