తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సాహూ గారపాటి ఒకరు. ఈయన కొంత కాలం క్రితమే నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టిన తక్కువ కాలం లోనే ఈయనకు మంచి గుర్తింపు తెలుగు సినిమా పరిశ్రమలో ఏర్పడింది. కొంత కాలం క్రితం ఈయన బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాను నిర్మించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే తాజాగా ఈయన విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన లైలా అనే మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాని ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఫిబ్రవరి 9 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్య అతిథిగా తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు , ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి 9 వ తేదీన నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తున్న చిరంజీవి తన తదుపరి మూవీ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ మూవీ ని సాహు గారపాటి నిర్మించబోతున్నాడు.

ఇప్పటికే ఈయన ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాడు. ఇకపోతే ఇప్పటికే తన బ్యానర్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్న చిరంజీవిని తన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా తీసుకురావడంలో సక్సెస్ అయిన సాహు గారపాటి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబో మూవీ కి సంబంధించిన చాలా విషయాలను చెప్పే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: