
ప్రస్తుతం తన సొంత నిర్మాణంలో చేస్తున్న హిట్ 3 సినిమా కోసం దాదాపు 70 కోట్లకు వరకు ఖర్చు పెడుతున్నారు నేచురల్ స్టార్ .. ఈ సినిమా తర్వాత వచ్చే నాని నెక్స్ట్ సినిమాల బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోయింది .. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో చేయబోయే పారడైజ్ సినిమాకు 100 కోట్లకు వరకు బడ్జెట్ ఉండబోతుంది .. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ మధ్య గ్రాండ్గా ఈ సినిమాను ప్రారంభించారు .. పాన్ ఇండియా స్థాయిలో నాని ఓదెల సినిమా రాబోతుంది .
ఇక నాని తర్వాత సినిమాల లైన్ అప్ కూడా ఎంతో బలంగా ఉంది .. ఈ సినిమా తర్వాత సుజీత్‌తో సినిమా చేస్తున్నాడు .. అలాగే శ్రీకాంత్ ఓదేల శైలేష్ కొలను సినిమాలు ప్రజెంట్ సెట్స్ పై ఉన్నాయి .. వీటిలో ఏ సినిమాకు బడ్జెట్ విషయంలో ఎలాంటి లిమిట్స్ లేవు .. ఇలా మొత్తానికి తన సినిమాల బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నాడు నాని . నాని సినిమా అంటే మినిమం కలెక్షన్లు గ్యారెంటీ కావడంతో నిర్మాతలు కూడా దేనికైనా సై అంటున్నారు.