![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-producer-s-61d409a7-4c55-40f4-aa16-775c6963e524-415x250.jpg)
సంక్రాంతి వార్‌లో రిలీజ్ అయిన సినిమాల విషయంలో పెద్దగా టికెట్ రేట్లు పెంచలేదు . గేమ్ చేంజర్ , డాకు మహారాజ్ సినిమాల కు పెంచిన నార్మల్గానే అయిన ఈ సినిమాలు భారీ కలెక్షన్లు సాధించాయి .. గతంలో ఏ సినిమాకు లేనివిధంగా ఒక్క సీజన్లో రిలీజ్ అయిన మూడు సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్షన్ ల మార్కును క్రాస్ చేసి కొత్త చరిత్రను లిఖించాయి. సంక్రాంతి సినిమాల కలెక్షన్ల లెక్కలతో కొత్త వాదనలకు తరలిపాయి .. ఇప్పటినుంచి పెద్ద సినిమాల విషయంలోనూ టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదని నిర్మాతలు అనుకుంటున్నారు ? మామూలు టికెట్ రేట్స్ తోనే పెద్ద సినిమాలను కూడా విడుదల చేస్తారా ? అన్న చర్చ ఇప్పుడు ఊపొందుకుంది.
అయితే ఇదే క్రమంలో అన్ని సినిమాల విషయంలో పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పలేం అన్నది మరి కొంతమంది వెర్షన్ .. కొన్ని సమయాల్లో సినిమా స్థాయిని బట్టి టిక్కెట్ రేట్లు పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది అన్నది పెద్ద నిర్మాతల వాదన. ఇక ఇప్పుడు ఏదేమైనా కూడా సామాన్యుడికి టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలన్న మాట మాత్రం ప్రేక్షకుల వైపు నుంచి గట్టిగా వస్తుంది .. సరైన కథతో వస్తే టికెట్ రేట్లు పెంచకపోయిన అలాంటి సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తాయన్న వాదనను ఈ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో నిజం చేశారు. మరి ఇప్పుడు ఈ విషయంలో ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.