ఇక ఇప్పుడు ఇదే తరహాలో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సినిమా రాబోతుంది .. షూటింగ్ దశలో ఉండగానే దీన్ని నిషేదించాలని బెంగాల్లో గొడవలు జరుగుతున్నాయి .. ఇదే అనుకుంటే తాజాగా ఢిల్లీ ఫైల్స్ సినిమా కూడా రాబోతుంది . ది కాశ్మీర్ ఫైల్స్ లో కాశ్మీర్ పండిట్‌లపై జరిగిన అరాచకాలను చూపించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి .. ఈసారి ఢిల్లీ ఫైల్స్ సినిమాతో వస్తున్నాడు .. అలాగే ది బెంగాల్ చాప్టర్ అనేది ఈ సినిమా టాగ్లైన్ .. ఇక అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నారు ..
మిధున్ చక్రవర్తి రాజ్యాంగంలోనే భారత రాజ్యాంగ ప్రవేశికను చదువుతూ నడుస్తున్నట్లు టీజర్లు చూపించారు .. ఇక 2002 ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన సబర్మతి అల్లర్ల నేపథ్యంలో . సబర్మతి రిపోర్ట్స్ సినిమా రీసెంట్ గానే వచ్చింది .. ఇక గోద్ర ఘటన పైన అదే పేరుతో మరో సినిమా కూడా రాబోతుంది .. టాలీవుడ్ స్టార్ నిఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌజ్ కూడా కాంట్రవర్షియల్ స్టోరీనే .. ఇక ఇందులో వీర్ సావర్కర్ నేపథ్యం ఉంటుంది .. ఈ సినిమాలన్నీ ఇప్పుడు విడుదలైన తర్వాత ఎలాంటి వివాదాలు కు దారి తీస్తాయో చూడాలి .