సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాలు ఉన్న వారికే క్రేజీ సినిమాల్లో అవకాశాలు ఎక్కువ శాతం దక్కుతూ ఉంటాయి. మంచి విజయాలు ఎవరికి అయితే వరుసగా వస్తూ ఉంటాయో అలాంటి వారే స్టార్ హీరోయిన్ స్థాయికి కూడా చేరుకుంటూ ఉంటారు. ఇకపోతే కొంత మంది కి మాత్రం ఫ్లాప్ సినిమాల ద్వారా కూడా మంచి సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఓ ముద్దుగుమ్మ విషయంలో ఇది తాజాగా రుజువయింది.

అసలు విషయం లోకి వెళితే ... కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో సూర్య ఒకరు. ఈయన ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రెట్రో అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే వరుస అపజయాలతో డిలా పడిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా వరుస అపజయలతో డీలా పడిపోయి ఉన్న సమయం లోనే ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఇకపోతే తాజాగా సూర్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా రెట్రో సినిమాలో పూజా హెగ్డే ను తీసుకోవడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చాడు.

తాజాగా సూర్యా మాట్లాడుతూ ... కొంత కాలం క్రితం పూజ హెగ్డే "రాదే శ్యామ్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమాలోని నటన చూశాక మా సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా సెట్ అవుతుంది అని నాకు అనిపించింది. దానితో ఆమెను సినిమాలో హీరోయిన్గా తీసుకున్నాం అని సూర్య చెప్పుకొచ్చాడు. ఇకపోతే రాదే శ్యామ్ మూవీ ఫ్లాప్ అయ్యింది. అలా ఫ్లాప్ మూవీ ద్వారా పూజా హెగ్డే కు ఏకంగా ఓ క్రేజీ సినిమాలోని ఆఫర్ వచ్చినట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: