కొంత మంది నటీమణులకు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే అద్భుతమైన గుర్తింపు వస్తూ ఉంటుంది. కానీ ఆ తర్వాత వారికి మంచి విజయాలు దక్కకపోవడంతో వారి క్రేజ్ తగ్గిపోయి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయిన బ్యూటీలు కూడా కొంత మంది ఉన్నారు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన జోష్ లో కెరియర్ ను కొనసాగించిన ఓ ముద్దు గుమ్మకు ప్రస్తుతం అవకాశాలే లేకుండా పోయాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫుల్ గా యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుంటూ వస్తుంది.

ఆ ముద్దు గుమ్మ మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని పూనమ్ బజ్వా. ఈమె నవదీప్ హీరోగా రూపొందిన మొదటి సినిమా అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె నాగార్జున హీరోగా రూపొందిన బాస్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ లో ఈ నటి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత ఈమె అల్లు అర్జున్ హీరోగా షీలా హీరోయిన్గా రూపొందిన పరుగు సినిమాలో హీరోయిన్ కి అక్క పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఆ తర్వాత ఈమెకు పెద్దగా సినిమాల్లో అవకాశాలు రాలేదు. దానితో ఈమె ప్రస్తుతం సినిమాల్లో వరసగా నటించడం లేదు. కానీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ గా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్తూ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: