సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ బిగినింగ్లో సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నటీమణులు అనేక ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కొంత మంది ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎక్కడ సినిమా ఆడిషన్స్ జరిగిన అక్కడికి వెళుతూ తమ పర్ఫామెన్స్ ను చూపిస్తూ ఉంటారు. ఇక కొంత మంది ఆడిషన్స్ ద్వారా ఆకట్టుకొని అవకాశాలను దక్కించుకుంటే , మరి కొంత మంది ఆడిషన్లలో రిజెక్ట్ అయినా ఆ తర్వాత క్రేజీ హీరోయిన్స్ అయిన వారు కూడా ఉన్నారు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ సాగిస్తున్న ఓ ముద్దుగుమ్మ కెరియర్ బిగినింగ్లో ఓ దర్శకుడి సినిమా కోసం ఆడిషన్స్ కోసం వెళితే ఆయన ఆ సినిమాలో ఆమెను రిజెక్ట్ చేశాడట. కానీ ఆ తర్వాత అదే దర్శకుడు వెతుకుంటూ వచ్చి ఆమెతో సినిమాను చేశాడట. అసలు ఈ విషయం ఏమిటో తెలుసుకుందాం. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్న వారిలో కావ్య దాపర్ ఒకరు. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా కావ్య దాపర్ మాట్లాడుతూ ... తాను కెరియర్ స్టార్టింగ్ లో రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ ఆడిషన్స్ కి వెళ్ళాను.

కానీ ఆ సమయంలో నేను ఇచ్చిన ఆడిషన్స్ నచ్చకో మరే కారణాల వల్ల తెలియదు కానీ నన్ను వారు ఆ సినిమాలో తీసుకోలేదు. ఇక ఆ తర్వాత డబల్ ఈస్మార్ట్ సినిమా కోసం మాత్రం పూరి జగన్నాథ్ స్వయంగా వచ్చి నన్ను ఆ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసుకున్నాడు అని కావ్య దాపర్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇకపోతే కొంత కాలం క్రితం విడుదల అయిన డబల్ ఈస్మార్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ సినిమాలో కావ్య మాత్రం తన అదిరిపోయే అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: