టాలీవుడ్ ఇండస్ట్రీ లో డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత నిర్మాతగా సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా ఈయన డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా సూపర్ గా సక్సెస్ అయ్యాడు. ఇప్పటికి కూడా దిల్ రాజు ఓ వైపు సినిమాలను నిర్మిస్తూనే , మరో వైపు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ డిస్టిబ్యూటర్ గా కూడా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... తాను నిర్మించిన ఓ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోదు అని తనకు ముందే తెలిసినట్లు కానీ , అది చెబితే చాలా మంది అలా జరగదు అని అన్నట్లు చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... కొంత కాలం క్రితం సిద్ధార్థ్ హీరోగా హన్సిక హీరోయిన్గా శృతి హాసన్ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ మై ఫ్రెండ్ అనే సినిమాను నిర్మించాం. ఆ సినిమా కథను చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఇక సినిమా స్టార్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ పూర్తి అయ్యాక ఆ సినిమాను చూశాను అది నాకు గొప్పగా అనిపించలేదు. ఆ తర్వాత సెకండాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ ను చేర్చాం. అయిన కూడా ఆ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. ఇక సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక ఓ సారి సినిమాను నేను చూశాను.

అప్పుడు కూడా నాకు ఆ సినిమా నచ్చలేదు దానితో ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోదు అని కొంత మంది తో నేను చెప్పాను. కానీ వారందరికీ ఆ సినిమా బాగా నచ్చింది. వారు ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని భావించారు. ఇక సినిమా విడుదల అయ్యింది. ఆ మూవీ కి ప్రేక్షకుల నుండి గొప్ప రెస్పాన్స్ రాలేదు. దానితో ఆ సినిమా విషయంలో నేను డెసిషన్ షేర్ చేసుకున్న వారంతా కూడా నీ డిసిషన్ కరెక్ట్ అయింది అని అన్నారు అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: