సాయి పల్లవి ఓకే ఆల్ రౌండర్ . ఎలాంటి రోల్స్ నైనా అవలీలగా నటించేస్తుంది. నాగచైతన్య పైనే అందరూ డౌట్లు పెట్టుకున్నారు . ఆ డౌట్లను ఏమాత్రం ముందుకు తీసుకెళ్ల నీకుండా నటించాడు నాగచైతన్య . ఈ సినిమాలో సాయి పల్లవి ఎలాంటి హై పెర్ఫార్మన్స్ ఇచ్చిందో అంతకు డబుల్ రేంజ్ లోనే నాగచైతన్య తన నటనతో మెప్పించాడు. అయితే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు హీరోయిన్ సాయి పల్లవిని పొగిడేస్తున్నారు . కాగా ఈ సినిమాలో ఒకవేళ సాయి పల్లవి హీరోయిన్గా కాకపోయి ఉంటే ..మరి ఏ హీరోయిన్ బాగుండేది అని జనాలు మాట్లాడుకుంటున్నారు.
చాలామంది హీరోయిన్ కీర్తి సురేష్ - రష్మిక మందన్నా అంటున్నారు. ఆల్రెడీ కీర్తి సురేష్ వద్దకు ఈ ఆఫర్ వెళ్ళగా రిజెక్ట్ చేసిందట . రష్మిక మందన్నా అయితే ఈ పాత్రలో ఇంకా బాగుండేది అంటున్నారు. మరికొందరు కాదు కాదు కాదు సాయి పల్లవినే ఈ పాత్రకు బాగా సూట్ అయింది అంటున్నారు. మొత్తానికి తండేల్ సినిమాతో మరొక బిగ్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి. అమరన్ మూవీ తర్వాత ఈ సినిమాతో మళ్లీ తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంటుంది హీరోయిన్ సాయి పల్లవి..!