హీరోయిన్లందరూ ఏదో ఒక సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ కి గురైనవాళ్లే..వాళ్ల తాతలు తండ్రులు తల్లులు ఇండస్ట్రీలో ఉన్నా సరే ఏదో ఒక డైరెక్టర్ దగ్గర నిర్మాత దగ్గర హీరో దగ్గర ఇలాంటి అనుభవాలను ఫేస్ చేసే ఉంటారు. అయితే అలాంటి వారిలో తమన్నా కూడా ఒకరట.ఈ విషయాన్ని తమన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడింది. కారవాన్ లోనే తమన్నాతో అసభ్యంగా ప్రవర్తించారట. మరి ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. తమన్నా ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో ఎన్నో సినిమాలు చేసింది కానీ హ్యాపీడేస్ సినిమా హిట్ తో తమన్నాకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది.ఈ సినిమా ఇచ్చిన స్టార్డంతో తమన్నా దాదాపు 17,18 సంవత్సరాలైనా సరే తన హవాని కొనసాగిస్తూ వస్తుంది.అయితే ఈ మధ్యకాలంలో కొత్త హీరోయిన్స్ రావడంతో తమన్నాకి హీరోయిన్ రోల్స్ తగ్గినప్పటికీ వెబ్ సిరీస్ లలో బాగానే అవకాశాలు వస్తున్నాయి. 

అలాగే స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ ప్రస్తుతం ఐటమ్ గర్ల్ గా స్పెషల్ సాంగ్ చేసే హీరోయిన్గ గా మారిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కారవాన్ లో తనకు జరిగిన చేదు అనుభవం గురించి బయట పెట్టింది. తమన్నా మాట్లాడుతూ.. అది నాకు ఒక చెడు రోజు అని నేను ఇప్పటికీ భావిస్తాను.ఎందుకంటే ఆ రోజు కారవాన్ లోనే ఆ వ్యక్తి చేసిన అసభ్య ప్రవర్తనకి నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అయితే ఆయన ఎవరు ఏం పని చేశారు అనేది మాత్రం ఇప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదు.

కానీ ఆయన చేసిన అసభ్య పనికి నేనైతే చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.కారవాన్ లో తమన్నాకి చేదు అనుభవం అంటే కచ్చితంగా ఓ హీరో అయినా అయి ఉండాలి..లేదా నిర్మాత అయినా అయి ఉండాలి..లేక డైరెక్ట్ అయినా అయి ఉండాలి. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తమన్నా ని కమిట్మెంట్ అడిగారని ఆమె మాటల్లోనే అర్థమవుతుంది. కానీ వాళ్ల పేర్లు బయట పెట్టడానికి ఆమె ఇష్టపడలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: