ఇక అక్షయ్ కుమార్ కు ముంబైలోని వర్లీలో 360 వెస్ట్ టవర్ లో ఒక భారీ అపార్ట్మెంట్ ఉంది . 39 వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్మెంట్ ఇప్పుడు అమ్మేసినట్లుగా తెలుస్తుంది .. ఇక దీనిని దాదాపు 100 కోట్లకు అమ్మేశారని అంటున్నారు .. ఇక దీంతో అక్షయ్ కుమార్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ? అని అనుమానాలు కూడా అభిమానుల్లో వస్తున్నాయి .. గత నెల చివర్లో అక్షయ్ తన ఇంటిని అమ్మేసినట్టు తెలుస్తుంది .. 6830 చదరపు అడుగుల్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ లో నాలుగు కార్ల పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి .. పలు నివేదికల ప్రకారం ఈ ఆస్తిని పల్లవి జైన్ అనే వ్యక్తి కొనుగోలు చేశారట .. అంతేకాకుండా 4.8 కోట్ల స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించారు ..
ఇక ఇది ముంబైలో ఎంతో ఖరీదైన వాణిజ్య ప్రాంతం కాబట్టి ఈ అపార్ట్‌మెంట్ చాలా తక్కువ ధరకు అమ్ముడైందని కూడా అంటున్నారు. ఇక గత కొన్నాళ్లుగా అక్షయ్ కుమార్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాలుగా మిగిలిపోతున్నాయి .. అయినా కూడా ఇప్పటికీ ఈ స్టార్ హీరో కు వరుస అవకాశాలు వస్తున్నాయి .. రీసెంట్ గానే ఈ హీరో నటించిన స్కై ఫోర్స్ సినిమా జనవరి 24న ప్రేక్షకులు ముందుకు వచ్చింది .. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలోె మెప్పించలేకపోయింది. ఈ సినిమా తర్వాతే అక్షయ్ కుమార్ తన అపార్ట్మెంట్‌ను అమ్మేశారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి ..