మనకు తెలిసిన నలుగురు మన గురించి గొప్పగా చెప్పడంలో ఎలాంటి కిక్ ఉండదు .. ముక్కు మొహం తెలియని వారు కూడా మన గురించి గట్టిగా మాట్లాడాలి ఆ మాటలు రిసౌండ్ల మోగాలి .. అప్పుడు క‌దా అసలైన మజా .. ఇక ఇప్పుడు సరిహద్దులు దాటి అలాంటి విజయాన్ని ఆస్వాదిస్తున్నారు పుష్పా2 టీం మెంబెర్స్. నెట్‌ఫ్లిక్స్ లో నెవర్ బిఫోర్ అంటూ దూసుకుపోతుంది పుష్ప2 .. నాన్ ఇంగ్లీష్ సినిమాలలో 5.8 వ్యూస్ తో అదరగొడుతుంది .. ఒక తెలుగు సినిమాకు లభించిన అరుదైన ఘనత కూడా అంటున్నారు క్రిటిక్స్ ..


మూడు గంటల 40 నిమిషాల ఓటీటీ వెర్షన్ ఎంజాయ్ చేస్తున్నారు గ్లోబల్ ప్రేక్షకులు. పుష్ప 2 పాట‌లకు ఎంత పెద్ద క్రేజ్‌ వచ్చిందో ఇప్పుడు అంతకు మించిన క్రేజ్‌ పేరు యాక్షన్ ఎపిసోడ్స్‌ కి వస్తుంది .. ఈ సినిమాలోని జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్ సీన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు జనాలు .. పుష్ప రాజ్ సూపర్ మాన్ తో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ స్పెషల్ వీడియోలు పోస్ట్లు వైరల్ చేస్తున్నారు. మార్వెల్ సినిమాల్లో ఈ టైప్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ని చూడలేదు బ్రోవాట్ ఏ  సీన్స్ అంటున్నారు .. ఎంతమంది హాలీవుడ్ సూపర్ హీరోలతో పోల్చిన  పుష్పరాజ్ వెరీ స్పెషల్ అంటున్నారు .


ఇండియన్ క్రియేటివ్ ఎనర్జీ చాలా కొత్తగా ఉంది .. దాన్ని హాలీవుడ్ ఉపయోగించుకుంటే ఎంతో బాగుంటుంది .. కథ చెప్పే విధానం లోవారికి అసలు సమయం ఉండదు ..  పుష్ప 2నిచూసి వారు ఎంతో నేర్చుకోవాలని కూడా అంటున్నారు . ఇప్పటివరకు బాహుబలి 2 , త్రిబుల్ ఆర్ గురించి మాట్లాడుకున్న ప్రపంచం ప్రేక్షకులు ఇప్పుడు తాజాగా పుష్ప 2 కలెక్షన్స్ , టేకింగ్ , మేకింగ్ కు ఫిదా అవుతున్నారు .. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రికార్డులు సృష్టించిన పుష్ప రాజ్ ఇప్పుడు సూపర్ హీరోలకు దీటైనా హీరోయిజాన్ని చూపిస్తూ ఓటీటీ లో ఉన్న ప్రపంచ సినీ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: