![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-venkatesh35a24e3c-26b8-4831-87da-9ccc5ce35ef5-415x250.jpg)
కర్ణాటకకు చెందిన కృతిక క్లాసికల్ డాన్సర్ .. మొదటిలో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది .. ఇక చిన్నతనంలో భరతనాట్యం పై ఆసక్తి పెంచుకుంది .. ఇక దాంతో ఈమె నాట్యం నేర్పించారు తల్లిదండ్రులు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు , షోలు కూడా ఇచ్చింది .. ఇదే క్రమంలో మలయాళ డైరెక్టర్ బాలు కిరియత్ ఈమెను చూసి సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారు .. అలా తెలుగులో వచ్చిన దృశ్యం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది .. అలా మొదటి సినిమాతోనే నటిగా తన అందం అభినయంతో ఆకట్టుకుంది .. ఇక ఈ సినిమాతో పాటు మలయాళం ఇటు తెలుగులోనూ చాలా క్రేజ్ తెచ్చుకుంది.
అలాగే కన్నడలోనూ బాక్సర్ అనే సినిమాలో నటించింది .. ఇక టాలీవుడ్ లో హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది .. ఇప్పటికే తెలుగులో ఈ బ్యూటీ వినవయ్య రామయ్య , రోజులు మారాయి , ఇంట్లో దెయ్యం నాకేం భయం వంటి సినిమాలో నటించింది .. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు అనుకొనంత క్రేజ్ రాలేదు .. అయితే కృత్తిగా సోషల్ మీడియాలో కూడా అంతగా యాక్టివ్గా ఉండదు .. అయితే ప్రస్తుతం ఈమెకు సంబంధించిన పాత ఫోటోలు కొన్ని ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి .