![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/mahesh-babu4f3f7421-89a8-476c-b747-e9fb62bace36-415x250.jpg)
అయితే కథలో క్యారెక్టర్ పరంగా బాడీని మార్చుకోవాల్సి ఉంటుంది .. తాను అలా మారి కనిపిస్తే ప్రేక్షకులు ఆదరించరని ఇలా ఉంటేనే తనను చూస్తారని చెప్పి తన దగ్గరకు వచ్చిన కథలకు ఏ హీరో అయితే బాగుంటాడో చెప్పి వారి దగ్గరకు పంపించేవారు .. అయితే నిర్మాతలు కూడా మహేష్ తో సినిమాలు తీయాలని ఎంతో ఆసుపడేవారు .. అలాంటి నిర్మాతల్లో గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా ఒకరు .. ఎప్పటికప్పుడు ఆయన మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల ఆలోచనలకు తగ్గ సినిమాలు తీస్తూ వస్తున్నారు.. వాటితో మంచి విజయాలు కూడా అందుకుంటున్నారు.. అలాగే గతంలో మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని అల్లు అరవింద్ ఎంతో ప్రయత్నించినప్పటికీ ఈ కాంబినేషన్ మాత్రం సెట్ కాలేదు .. ఇలా చేస్తుంటే కుదరదేమో అని భారీ బడ్జెట్ తో భారీ సినిమాని మహేష్ బాబుతో నిర్మించాలని అల్లు అరవింద్ అనుకున్నారు ..
బాలీవుడ్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకొని తెలుగు వరకు మహేష్ బాబును ఒప్పించే బాధ్యత అల్లు అరవింద్ తీసుకున్నారు .. అయితే ఆ సినిమాను చేయడానికి కూడా మహేష్ బాబు ఒప్పుకోలేదు .. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు రామాయణం .. ప్రస్తుతం బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ , సాయి పల్లవి తో తెర్కక్కిస్తున్న ఈ సినిమాను ముందుగా మహేష్ తో చేయాలని అరవింద్ భావించారు. అయితే ఈ సినిమా మొత్తం బాడీ పై చొక్కా లేకుండా నటించాల్సి ఉండటంతో అందుకు మహేష్ ఒప్పుకోలేదు .. తనను ఒంటి మీద చొక్కా లేకుండా చూడాలంటే బాలీవుడ్ ప్రేక్షకుల కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా అంగీకరించరని మహేష్ అన్నారు . ఇలా అల్లు అరవింద్ - సూపర్ స్టార్ కాంబినేషన్లో సినిమా మిస్ అవుతూ వచ్చింది .. ఇక మరి భవిష్యత్తులో కూడా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందో లేదో చూడాలి