![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/dasari-sr-ntr-politics-fight-no-talk47537b48-fda2-4b9f-8c17-b755d35aa042-415x250.jpg)
అసలు విషయంలోకి వెళ్తే పాలకొల్లులో దాసరి ఫ్యామిలీ ముందు నుంచే కాంగ్రెస్ పార్టీకి మంచి అనుబంధము ఉండేదట సినిమా రంగంలోకి వచ్చినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో మంచి స్నేహబంధం కూడా ఉండేదట. సీఎం జనార్దన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పథకాలను సైతం ప్రకటన చేసేందుకు దాసరి నారాయణరావుకి ఆ బాధ్యతలను అప్పగించారట. అయితే ఆ తర్వాత కాపు నేతగా పేరుపొందిన వంగవీటి మోహన రంగా హత్య ఆయనను తీవ్రంగా కలిసి వేసిందట దాసరి గారిని. అయితే అప్పుడు టిడిపి పార్టీ వెంటాడి చంపిందని దాసరి గారికి దగ్గర సన్నిహితులు చెప్పడంతో..చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారట. అప్పటినుంచి సీనియర్ ఎన్టీఆర్, దాసరి మధ్య మాటలు లేవని ఇండస్ట్రీలో వార్తలు వినిపించేవట.
అయితే ఆ తర్వాత చాలా నియోజకవర్గాలలో దాసరి గారు ప్రచారాన్ని మొదలు పెట్టారని.. రాజీవ్ గాంధీ తో పాటు మర్రి చెన్నారెడ్డి వంటి నేతలు కూడా ప్రశంసలు గురిపించారు. ఇక అప్పటినుంచి 2004లో వైయస్సార్ అధికారంలోకి వచ్చేంతవరకు కూడా దాసరిగారే పార్టీకి ఎన్నో కార్యక్రమాలకు ప్రచార చిత్రాలకు కూడా పనిచేసే వారట. అయితే వీటన్నిటిని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి సహాయంతో రాజ్యసభ వరకు దాసరి గారు వెళ్లారని ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకున్నారట.