![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/heroine8fbc6984-1819-45f2-9137-b19b8b8b43af-415x250.jpg)
శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు .. పెళ్లి సందడి మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత శ్రీలీల మరో స్టార్ హీరో రవితేజకు జంటగా ధమాకా సినిమాలో నటించింది ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది .. ఇక దీంతో శ్రీలీలకు వరుస అవకాశాలు వచ్చాయి .. ఇదే క్రమంలో స్కంద , భగవంత్ కేసరి , గుంటూరు కారం , ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో శ్రీలీల అదరగొట్టింది. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ , విజయ్ దేవరకొండ కొత్త సినిమాల్లో కూడా శ్రీలీల చాన్స్ కొట్టేసింది.. ఇలా టాలీవుడ్ లోనే బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది .. ఇదే సమయంలో కోలీవుడ్ లో కూడాఈమె పల్లు సినిమాలతో సత్తా చాటుతుంది .. అంతేకాకుండా ఈ సంవత్సరమే బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టడానికి రెడీ అవుతుంది ఈ బ్యూటీ.
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ ప్రస్తుతం దిలర్ మూవీ చేస్తున్నాడు ఇందులో శ్రీలీల అని హీరోయిన్గా తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదే క్రమంలో తాజాగా శ్రీలీల చేసిన ఓ పని అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తుంది .. ఈ హీరోయిన్ ఒక అనాధ ఆశ్రమాన్ని సందర్శించింది .. అక్కడ పిల్లలు పడుతున్న కష్టాలను చూసి ఎంతో చెల్లించి పోయింది .. వెంటనే అక్కడ ఉన్న ఈ ఇద్దరు విభిన్న ప్రతిభావంతులైన పిల్లలు గురు , శోభితులను ఈమె దత్తత తీసుకొని వారికి మంచి జీవితాన్ని అందించబోతుంది .. ఇక ఈ విషయం తెలిసిన అందరూ శ్రీలీలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ అందరికీ మంచి మనసు ఉండదని ఇంత చిన్న వయసులోనే శ్రీలీలా పిల్లల్ని దతత్త తీసుకొని తనలోని గొప్ప మనసును చాటుకుందని ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు .